రహదారి నిర్మాణంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు

54చూసినవారు
రహదారి నిర్మాణంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు
పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం వేకువజాము నుంచి ఈ ప్రాంతంలో వేర్వేరు చోట్ల చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో ఆగిన లారీలను క్రేన్లు సహాయంతో ఎస్. ఐ లు మహేష్ లక్ష్మీ ప్రసన్నకుమార్ లు ట్రాఫిక్ క్లియర్ చేశారు. రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్