ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి

56చూసినవారు
ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి
ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని బొండపల్లి ఎంపీపీ చల్ల చల్లంనాయుడు అన్నారు. మంగళవారం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణంపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష జరిపారు. ఎంపీడీవో ఎస్. హరిహరరావు మాట్లాడుతూ జగనన్న కాలనీలో 1833 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 1277 పూర్తయినట్లు చెప్పారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ గంగాధర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :