గుర్ల మండలంలో సివిల్, కేంద్ర బలగాల ఫ్లాగ్ మార్చ్
విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశాల మేరకు శనివారం జిల్లాలో గుర్ల మండలం గుజ్జింగ వలస, జమ్ము, పెద నాగళ్ల వలస గ్రామాల్లో గుర్ల ఎస్సై ఎస్. భాస్కరరావు ఆధ్వర్యంలో సివిల్, ఆర్ పి ఎస్ ఎఫ్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, ప్రశాంతాయుతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని, ప్రతీ ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు.