13న లోకల్ హాలిడే :జిల్లా కలెక్టర్
సాధారణ ఎన్నికల సందర్భంగా ఈనెల 13వ తేదీన స్థానిక సెలవును ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు జీతంతో కూడిన సెలవును జిల్లాలో ప్రకటించారు. నెగోషియాబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ చట్టం కింద కూడా ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు. అందరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.