మేనిఫెస్టోలు చూసి మోసపోవద్దు: బీఎస్పీ అభ్యర్థి తేజారాణి

69చూసినవారు
మేనిఫెస్టోలు చూసి మోసపోవద్దు: బీఎస్పీ అభ్యర్థి తేజారాణి
అధికార ప్రతిపక్షపార్టీల మేనిఫెస్టోలు చూసి మోసపోవద్దని బీఎస్పీ నెల్లిమర్ల అభ్యర్థి ఎరుకొండ తేజారాణి వెల్లడించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పాలకులు మారినా పేదవారి బతుకులు మారలేదని, ఓట్లు దోచుకోవడానికే ఆచరణకు అమలుకాని హామీలతో మేనిఫెస్టోలు తయారు చేశాయని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడంతో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్