నిందితుడికి పదేళ్ల జైలు

54చూసినవారు
నిందితుడికి పదేళ్ల జైలు
బొండపల్లి పోలీస్‌ స్టేషన్‌లో 2019లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడైన నెల్లిమర్ల మండలం ఏటీ అగ్రహారం గ్రామానికి చెందిన నారు అప్పలనాయుడుకు పదేళ్ల జైలు శిక్ష, రూ.9వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కె.నాగమణి తీర్పు చెప్పారని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అప్పలనాయుడు మండలానికి చెందిన ఓ యువతికి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా లోబర్చుకుని.. వివాహానికి నిరాకరించడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్