పోగొట్టుకున్న విలువైన వస్తువులను బాధితులకు అందించిన నెల్లిమర్ల పట్టణ పోలీసులు

841చూసినవారు
పోగొట్టుకున్న విలువైన వస్తువులను బాధితులకు అందించిన నెల్లిమర్ల పట్టణ పోలీసులు
నెల్లిమర్ల పట్టణ పోలీసులు పోయిన విలువైన వస్తువులను బాధితులకు అందించారు. అందులో విలువైన సర్టిఫికెట్లు మరియు వస్తువులు తిరిగి బాధితులకు అందజేయడం జరిగింది. 23 వ తేదీ మద్యాహ్నం సుమారుగా 2 గంటల సమయంలో గంట్యాడ మండలం మురపాక గ్రామం కు చెందిన మహిళ నెల్లిమర్లలో ఆటోలో ప్రయానిస్తు తన వెంట తెచ్చుకున్న బ్యాగును ఆటోలో మరిచిపోయి నెల్లిమర్లలో దిగిపోయింది. ఆ బ్యాగులో వాళ్ళ అమ్మాయి తాలూక సర్టిఫికెట్లు మరియు విలువైన సామాన్లు ఉన్నాయని తేదీ 24-06-2023 న నెల్లిమర్ల ఎస్ ఐ వద్దకు వచ్చి తన బ్యాగు వెతికి ఇప్పించవలసిందిగా చెప్పగా ఆయన వెంటనే స్పందిచి తన సిబ్బందితో కలిసి బ్యాగును వెతికి పట్టుకొని సోమవారం ఆ మహిళ కు అప్పగించినారు ఆమె ఎంతో హర్షం వ్యక్తపరుస్తూ ఎస్ ఐకు కృతజ్ఞతలు తెలియపరిచినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్