పార్వతీపురంలో వివాహిత ఆత్మహత్య

83చూసినవారు
పార్వతీపురంలో వివాహిత ఆత్మహత్య
చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన పార్వతీపురంలోని పార్వతీ నగర్లో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం చింతాడ కుమారి (42) వ్యక్తిగత కారణాల వల్ల శుక్రవారం ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందన్నారు. గమనించిన తల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్