పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రాధాన్యత ఇవ్వాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్ లతో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. ఎస్ డి జి గోల్స్ సాధించాలని ఆయన అన్నారు. విద్యార్థుల ఆరోగ్య కార్డులను నింపాలని ఆయన అన్నారు. ఆరోగ్య తనిఖీలు పక్కాగా నిర్వహించాలని చెప్పారు. వసతి గృహాల్లో అనారోగ్య సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు.