రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం

72చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం
రాష్ట్ర అభివృద్ధి తెదేపా తోనే సాధ్యమని గజపతినగరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాత్రి జామి మండలం తాండ్రంగిలో స్థానిక టిడిపి నాయకులు బండారు జగదీష్, సాయి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టిడిపి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్