పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును సోమవారం ఆయన నివాసంలో ఎస్. కోట నియోజకవర్గ జనసేన నాయకులు ఒబ్బిన సన్యాసినాయుడు మర్యాదపూర్వకంగా కలసి, దుస్సాలువాతో సత్కరించి తన అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జన సైనికులు మంచిన జాని, మల్లు వలస నాని, రమణ, దొరబాబు, కొల్లు సురేంద్ర, పట్రాన రవి పాల్గొన్నారు.