
విశాఖ: జర్నలిస్టులకు రూ. 55వేలు ఆర్ధిక సహాయం
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తన పరిధి మేరకు సహాయం కూడా చేస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద ఒక ప్రయివేటు కార్యాలయంలో పలువురు జర్నలిస్టులకు గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా రూ. 55 వేలు ఆర్ధిక సహాయం అందించారు. తాను సొంతంగా యూనియన్ లకు అతీతంగా వీటిని జర్నలిస్టులకు అందజేసామన్నారు.