విశాఖ దక్షిణ నియోజక వర్గం పరిధిలో శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలు ముగిశాయి. శుక్రవారం ప్రధాన ఉత్సవ అధికారి కే. శిరీష, ఆలయ ఈఓ టి. రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీలు తెరిచి లెక్కింపు చేయగా, రథయాత్ర పది రోజులకుగాను హుండీ ఆదాయం రూ 19, 80, 072 వచ్చింది. ఈ నెల 25న దేవస్థానం ప్రాంగణంలో మహా అన్నదానం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.