అరకులోయ మండలంలోని శనివారం మధ్యాహ్నం ఒక్కసారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో మండలంలోని పద్మాపురం వద్ద వాలీబాల్ మ్యాచ్ చూస్తున్న ఇద్దరిపై పిడుగు పడడంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరిద్దరిని 108లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాతకోట పంచాయితీలోని గూనగుమ్మికి చెందిన రంగారావు మృతిచెందగా తీవ్రంగా గాయపడ్డ సాయికి చికిత్స అందజేస్తున్నారు.