బండరాయిలను తొలగించాలి

76చూసినవారు
బండరాయిలను తొలగించాలి
చింతపల్లి మండలంలోని బోడకొండమ్మ ఘాట్ రోడ్డుపై జారిపడి ఉన్న బండరాయిలను తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు బోడకొండమ్మ ఘాట్ రోడ్డుపై పెద్దపెద్ద బండరాయిలు జారిపడి ఉన్నాయని రాకపోకల సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదని ఆందోళన చెందుతున్నామని ప్రయాణికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి బండరాయిలను తొలగించాలని పలువురు ప్రయాణికులు సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్