అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీకి చెందిన వైసిపి సర్పంచ్ బిమలమ్మ పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని తనను అవమానిస్తున్నారని గురువారం కంటతడి పెట్టుకున్నారు. భీంపోలు పంచాయతీలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం ఎన్నికల పరిశీలకురాలు హైమావతి పర్యటించారు. వారి రాకకోసం సర్పంచ్ ఏర్పాట్లు చేయగా కనీసం ఆమె వద్దకు వెళ్లకుండానే ఇరువురు ముందుకు వెళ్లిపోయారు. సర్పంచ్ వద్దకు వెళ్లకపోవటంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు.