మాడుగుల ప్రారంభమైన దసరా ఉత్సవాలు

74చూసినవారు
మాడుగుల ప్రారంభమైన దసరా ఉత్సవాలు
మాడుగులలో విజయదశమి నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాడుగుల బస్టాండ్ ఆవరణలో గల దుర్గాదేవి ఆలయంలో ఈ ఉత్సవాలు ఈనెల 12వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆర్టీసీ సివిల్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుడు శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్