నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

67చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం
నర్సీపట్నం ఇండోర్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణారావు సోమవారం నర్సీపట్నంలో తెలిపారు. లైన్, సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పాలిటెక్నిక్ ఫీడర్ పరిధిలో గల శివపురం, పెద్ద చెరువు, గుర్రాలరోడ్డు, ధనిమిరెడ్డి వీధి, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్