అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం లోని వారమామిడి నుండి చిన్న అగ్రహారం గ్రామం వరకు ఇటీవల నిర్మించిన 3కిలో మీటర్ల తారు రోడ్డు కు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్థులు మంగళవారం డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల నిర్మించిన బిఎస్ఎన్ఎల్, జియో టవర్లు నిర్మాణం లో బాగంగా జెసిబి, యంత్రాలు విచ్చలవిడిగా ఉపయోగించి రోడ్డు ద్వంసం చేసారని మాకు ఎంతో పోరాటం చేస్తేనే అప్పట్లో కొత్త రోడ్డు మంజూరు అయ్యిందని వాపోయారు.