ఈ నెల 6 న అనకాపల్లి లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ ను జయప్రదంచేయాలని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పిలుపునిచ్చారు. శనివారం అనకాపల్లి బైపాస్ రోడ్ లో గల బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోజు సాయంత్రం 5గంటల
నుంచి కశింకోట మండలం ఉగ్గిన పాలెం జాతీయ రహదారిపై జరుగు ఈ సభకు అనకాపల్లి, అరుకు, తూర్పుగోదావరి జిల్లా కూటమి పార్టీల అభ్యర్థులు పాల్గొంటారని
తెలిపారు.