రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈనెల 12వ తేదీన కొలువుతీరునున్న నేపథ్యంలో మంత్రివర్గంపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణకు మంత్రివర్గంలో చోటు కల్పించడం పై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ఆయనకు కోటాపై ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది.