జగినివలస గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతి

54చూసినవారు
జగినివలస గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతి
అరకులోయ మండలంలోని సిరాగం పంచాయతీ పరిధి జగినివలస గ్రామానికి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తుడు రాంబాబు మాట్లాడుతూ. గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేక ఉన్న మట్టిరోడ్డుతో వర్షాకాలంలో బురదమయంగా మారుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి జగనివలస గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన ఆదివారం కోరారు.

సంబంధిత పోస్ట్