విశాఖ డైరీ పాల ధరను పెంచాలని కోరుతూ శుక్రవారం చోడవరం అన్నవరంలో ఉన్న పాల కేంద్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్సి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో రైతులు డిమాండ్ చేశారు. పాలు ధర నీరు ధర ఒకేలా ఉన్నాయన్నారు. పాడి పరిశ్రమను పూర్తిగా అర్థం చేసుకుని పాల రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ పాల రేటు పెంపు నిర్ణయం తీసుకునే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.