వందే భారత్ ట్రైన్ లో ప్రయాణం సామాన్యుడు మాత్రమే కాదు మధ్యతరగతి జీవి సైతం కాలు పెట్టేందుకు అవకాశం లేనట్లుగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే. ఈ మధ్యనే విశాఖపట్నం -దుర్గ్ మధ్యన మొదలైన వందే భారత్ ట్రైన్ టికెట్ ధర గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. కేవలం 60కి. మీ. దూరానికి ఛైర్ కార్ ఛార్జీ రూ. 435గా డిసైడ్ చేస్తే. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ లో రూ. 820గా నిర్ణయించారు.