ప్రతి తల్లి పేరు మీదుగా ఒక మొక్కను నాటి, సంరక్షించి పెంచాలని విశాఖపట్నం పోర్టు అథారిటీ సెక్రటరీ టి వేణుగోపాల్ సూచించారు. ఈ మేరకు పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో కిల్లోగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల హైస్కూల్‌లో స్వచ్ఛతా హీ సేవా-2024 కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్ధినిలతో 1000 మొక్కలు నాటించి, స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు.