
విశాఖ: రెవెన్యూ సదస్సులతో సమస్యల పరిష్కారం
రెవెన్యూ సదస్సులతో సమస్యలు పరిష్కారం కానున్నాయని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన 17, 18, 19, 20, 21 , 22, 28 వార్డులకు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఆయన సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.