స్టిల్ ప్లాంట్: విషసర్పాన్ని పట్టుకున్న స్నేక్ క్యాచర్

69చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్-4లో గల ఓ ఇంటి బాత్రూంలో దూరిన విషసర్పాన్ని స్నేక్ సేవర్ సొసైటీకి చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు. బాత్రూంలో త్రాచు పాము ప్రత్యక్ష కావడంతో ఇంటి వారందరూ భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. విషయాన్ని స్నేక్ క్యాచర్ కు తెలియజేయడంతో ఆయన అక్కడకు చేరుకొని పామును పట్టుకుని బంధించారు. ఇది అత్యంత విషపూరితమైన సర్పం అని స్నేక్ క్యాచర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్