విశాఖ: ట్రాఫిక్ పోలీసుపై ఆటో డ్రైవర్ దాడి

66చూసినవారు
విశాఖ: ట్రాఫిక్ పోలీసుపై ఆటో డ్రైవర్ దాడి
పాత గాజువాక జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి ఒక ఆటో డ్రైవర్ కానిస్టేబుల్ పై దౌర్జన్యం చేశాడు. రోడ్డుపై ఆటో నిలిపి ఉంచడంపై ట్రాఫిక్ కానిస్టేబుల్ సున్నితంగా హెచ్చరించగా, డ్రైవర్ చందర్రావు ఆగ్రహంతో స్పందించి గొడవకు దిగాడు. అతని వ్యవహారం శాంతించకపోవడంతో గాజువాక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్