వైభవంగా అప్పన్న స్వామివారి స్వర్ణ పుష్పార్చన

82చూసినవారు
వైభవంగా అప్పన్న స్వామివారి స్వర్ణ పుష్పార్చన
సింహాచలం అప్పన్నకు గురువారం స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణపుష్పార్చన, జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధిష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణపుష్పార్చన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్