ఏపీలో వ‌ర్షాలే వ‌ర్షాలు

65చూసినవారు
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయ‌ని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద వెల్ల‌డించారు. సోమ‌వారం ప్ర‌త్యేక బులిటెన్ విడుద‌ల చేశారు. రుతుప‌వ‌నాల రాక‌తో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డుతుంద‌ని, రెండు, మూడు రోజుల్లో రాష్ట్రమంతా ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ముఖ్య‌మంగా నెల్లూరు, రాయలసీమలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. సోమ‌వారం తెల్ల‌వారుజామున కూడా విశాఖ‌లో వ‌ర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్