కొబ్బరితోటలో ఉచిత బ్లడ్ టెస్ట్ క్యాంప్

368చూసినవారు
కొబ్బరితోటలో ఉచిత బ్లడ్ టెస్ట్ క్యాంప్
ఇన్నర్ వీల్ క్లబ్, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొబ్బరితోట విద్యార్థి ట్యూషన్ సెంటర్ కేంద్రంగా 10 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ ఉచిత హెచ్.బి.స్క్రీనింగ్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది మహిళలు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. బ్లడ్ తక్కువ ఉన్నవారికి మందులను అందజేశామని ఇన్నర్ వీల్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ సౌమ్య రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ నమ్రత, జి.విజయ భవన్, వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ నిర్వాహకులు ఎల్లాజీ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్