ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ‍్యంలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు విశాఖలో ఏడు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్ట కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భీమిలి, విశాఖ తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ, పెందుర్తి, గాజువాక ప్రాంతాల్లో స్రీ‍్కన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.