మొగల్తూరు: వంద మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో గురువారం సముద్రపు అలలు ఎగసిపడుతూ సుమారు 100 మీటర్లు మేర ముందుకు వచ్చాయి. అలాగే సముద్ర తీరంలోని దుకాణాలు సముద్రం అలల ఉధృతికి గురయ్యాయి. అదేవిధంగా పర్యాటకులు బీచ్ కు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.