ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరుకానున్న 10, 946 మంది

557చూసినవారు
మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహిస్తామని జేసీ ప్రవీణ్ ఆదిత్య సోమవారం తెలిపారు. ఫస్ట్, సెకండ్ ఇంటర్‌కు కలిపి మొత్తం 10, 946 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఫస్ట్ ఇంటర్ జనరల్ 8, 793 మంది, ఒకేషనల్ 384 మంది, మొత్తం 9, 177 మంది ఉన్నారు. అలాగే సెకండ్ ఇంటర్ జనరల్ 1, 547 మంది, ఒకేషనల్ 222 మంది మొత్తం 1, 769 మందికి గానూ కలిపి 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్