ప్రకృతి వైపరీత్యాల కారణంగా పేద ధనిక వర్గాలనే తేడా లేకుండా కష్టాలు పడటం సర్వ సాధారణమని, మానవత్వం చూపించి వారికి ఇతోధికంగా దాతలు సహాయ సహకారాలు కర్తవ్యంగా భావించి అందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధికి సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ భీమవరం తరపున రూ 51, 116 లను ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు.