ఏలూరు జిల్లాలో నిర్మితమవుతున్న పలు జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ విషయంపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏలూరు గౌతమీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ. భూసేకరణకు సంబంధించి అవరోధాలను అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించి రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.