నేతలతో ఆనందం పంచుకున్న భూపతిరాజు

80చూసినవారు
నేతలతో ఆనందం పంచుకున్న భూపతిరాజు
కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన తనకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శారదా దేవిని ఆత్మీయ ఆలింగనం చేసుకొని తన ఆనందాన్ని పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్