ఎంపీ శ్రీనివాసవర్మ ను కలిసిన ఎమ్మెల్యే నాయకర్

68చూసినవారు
ఎంపీ శ్రీనివాసవర్మ ను కలిసిన ఎమ్మెల్యే నాయకర్
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాసవర్మను జనసేన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బొమ్మిడి నాయకర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్య టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్