పశ్చిమగోదావరి జిల్లా పసలదీవి గ్రామంలో శుక్రవారం దుర్గమ్మ ఆలయంలో పసలదీవి ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ మరియు గ్రామ ప్రజల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అన్నసంతర్పణ, మహిళల సామూహిక కుంకుమపూజలను అర్చకులు సీతారామశాస్త్రి వైభవంగా నిర్వహించారు. సాయంత్రం దీపోత్సవం, మురళీకృష్ణ భజన కోలాటం భక్తులను ఆకట్టుకుంది.