అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి నిమ్మల

78చూసినవారు
బుడమేరు గండ్ల పూడిక పనుల్లో రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం, చలి గాలులు వీస్తున్నప్పటికీ చిత్తశుద్ధితో బుడమేరు గండ్ల పూడిక పనుల్లో మంత్రి నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు వానలో తడుస్తూనే పనులను పర్యవేక్షించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్