దాబాలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీ

52చూసినవారు
జీలుగుమిల్లి మండలం దర్భగూడెం సమీపంలోని న్యూ పంజాబీ దాబాలో గురువారం రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో భాగంగా దాబాలో కుళ్ళిన కోడిగుడ్లు, మాంసం, పన్నీరును గుర్తించినట్లు తెలిపారు. అనంతరం వాటి శాంపిల్స్ ను ఉన్నతాధికారులకు అందించి, విచారణ అనంతరం దాబా యజమానులపై చర్యలు తీసుకుంటామని వీఆర్వో షాషా తెలిపారు.

సంబంధిత పోస్ట్