కంచుకోటకు మారుపేరు ఉండి నియోజకవర్గం అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం నాగుండెల్లో ఉందని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అండగా నిలబడిన నియోజకవర్గం ఈ ఉండి నియోజకవర్గం అని అన్నారు. 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఉండి హైస్కూల్‌ను పునఃనిర్మాణం చేశారని అన్నారు.