రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేష్ ప్రజలకు అభివాదం చేస్తూ వారిని పలకరిస్తూ ముందుకు వెళ్లారు.