కొవ్వూరు - Kovvuru Mandal

కలిసి పని చేద్దాం.. విజయం సాధిద్దాం..

టిడిపి-జనసేన పార్టీ కలిసి పనిచేసి విజయం సాధిద్దామని కొవ్వూరు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరు సమావేశంలో కొవ్వూరు నియోజకవర్గ ధ్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి అన్నారు. కంటమణి రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గం టిడిపి కంచుకోట అని టీడీపీ- జనసేన కూటమి సత్తాను చాటాలని, దీనిలో భాగంగా 28వ తేదీని తాడేపల్లిగూడెంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీటింగ్ వెళ్ళు నిమిత్తం టకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కొవ్వూరు జనసేన ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మాట్లాడుతూ టిడిపి జనసేనలో ఏ పార్టీకి సీటు వచ్చినా అందరూ కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న జగన్ అరాచక పాలన అంతమోందించి జగన్ను ఇంటికి సాగనంపాలన్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా