పెనుమంట్ర: వాహనాలు దారి మళ్లింపు
మార్టేరు-పాలకొల్లు మార్గంలో ఈ నెల 25 నుంచి రహదారి నిర్మాణ పనుల నిమిత్తం వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మార్టేరు పరిధిలో సుమారు 700 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పాలకొల్లు వెళ్లాల్సిన వాహనదారులు ఆలమూరు, కొమ్ము చిక్కాల మీదుగా కవిటం లేదంటే లంకలకోడేరు మీదుగా పాలకొల్లు వెళ్లాలని సూచించారు.