భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భయంతో భర్త కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారికి చెందిన విజయ్(24) పల్లవి(22)కి గతేడాది వివాహం జరిగింది. సంక్రాంతికి పుట్టింటికి వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చిన పల్లవి పురుగుమందు తాగి ఇంట్లో పడిఉండటంతో కుటుంబసభ్యులు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తనపై అపవాదు
వస్తుందని విజయ్ కూడా పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.