AP: వైసీపీ అధినేత జగన్ కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోటరీకి బ్రేక్ పెట్టి.. ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారికి క్షేత్రస్థాయిలో ఆయా పదవుల్లో నియమించనున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.