టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. క్లారిటీ

80చూసినవారు
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. క్లారిటీ
పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని చెప్పారు. ‘వైసీపీ టికెట్‌పై గెలిచి టీడీపీ వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది. నేను పార్టీ మారడం లేదు. వైఎస్సార్ ఆశయాల కోసం జగన్ పట్టుదలను చూసి వైసీపీలో చేరాను. జగన్ నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాడుతా.’ అని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు.

సంబంధిత పోస్ట్