ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తాజాగా టైమ్స్ నౌ-ఈటీజీ వెల్లడించింది. దీని ప్రకారం ఏపీలో మరోసారి
జగన్ ప్రభుత్వం ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. 51 శాతం ఓట్లతో వైసీపీకి 117-125 సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే 47 శాతం ఓట్లతో ఎన్డీయే కూటమి 50-58 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైందని, దీని ప్రభావం ఫలితాలపై ఎక్కువగా ఉంటుందని టైమ్స్ నౌ-ఈటీజీ తెలిపింది.