AP: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తన నియోజకవర్గం పులివెందులలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం.. ఆయన ఆస్పత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని స్థానిక నేతలు తెలిపారు.